News April 16, 2025

నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..! 

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి వద్ద<<>> మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 22, 2025

యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

image

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.

CSKకు గెలవాలనే కసి లేదు: రైనా

image

ఐపీఎల్ 2025లో సీఎస్కేకు గెలవాలనే తపన, కసి లేవని ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా అన్నారు. ప్రస్తుతం అన్ని జట్లకన్నా సీఎస్కేనే బలహీనంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జట్టులోని ఆటగాళ్లకు అసలు అంకితభావం, చిత్తశుద్ధి లేనట్లుగా కనిపిస్తోంది. ఇది నేను వారిని అవమానిస్తున్నట్లు కాదు. గతంలో సీఎస్కేకు ఉండే బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు కనిపించడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

error: Content is protected !!