News January 23, 2025

నాగర్‌కర్నూల్: రెండు లక్షల ఉద్యోగులు భర్తీ చేయాలి: బీజేపీ

image

తెలంగాణలో ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ త్వరగా వాటిని భర్తీ చేయాలని నాగర్‌కర్నూల్ BJP ప్రధాన కార్యదర్శి గంగి శెట్టి నాగరాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ నోటిఫికేషన్లు పూర్తి చేసి తమవిగా కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ఆలోచన ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News April 11, 2026

పాడేరు ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య వర్మ

image

పాడేరు ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మ శనివారం ఉదయం తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ముందుగా ఆయన తన సతీమణి, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజతో కలిసి మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు, గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

News April 11, 2026

నెల్లూరు కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు మరోసారి సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు లభించాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోపు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో కలెక్టర్ ‘వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. అధికారులను నెలలో నాలుగు సార్లు గ్రామానికి పంపి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే విధానాన్ని అందరూ అనుసరించాలని సీఎం ఇతర కలెక్టర్లకు సూచించారు.

News April 11, 2026

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

image

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.