News February 21, 2025

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తాడూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కాలువలో పడటంతో యువకుడు మృతిచెందిన ఘటన నిన్న సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలిలా.. కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన వినోద్‌గౌడ్ బైక్‌పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డుపక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో వినోద్ మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News October 26, 2025

ఎంజీఎం సూపరింటెండెంట్‌పై వేటు

image

ఎంజీఎం ఆసుపత్రిలో వరుస ఘటనలు,<<18099653>> ‘ఔరా ఇదేం వైద్యం.. ఎంజీఎంలో ఇద్దరికీ ఒకే సిలిండర్!’ <<>>అని Way2Newsలో శనివారం మధ్యాహ్నం ప్రచురితమైన కథనంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌పై వేటు వేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, ప్రతి వారం ఆసుపత్రిపై సమీక్షించి నివేదిక ఇవ్వాలని డీఎంఈ నరేంద్ర కుమార్‌కు సూచించారు.

News October 26, 2025

ANU రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.B.A, PG రీవాల్యుయేషన్ ఫలితాలను శనివారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.B.A 4-సెమిస్టర్, M.SC 3-సెమిస్టర్ ఫారెస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, M.SC 1-సెమిస్టర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్& టెక్నాలజీ సబ్జెక్టుల రీవాల్యుయేషన్ ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలన్నారు.

News October 26, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

కార్తీక మాసం ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెద్దగా తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.220-240, సూర్యాపేటలో రూ.220గా ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.240, విశాఖలో రూ.270, చిత్తూరులో రూ.220-245, కర్నూలులో రూ.200-240 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో రేట్లు తగ్గలేదని, రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.