News April 17, 2025

నాగర్‌కర్నూల్: వంగూరు మండలానికి ఘనమైన చరిత్ర..!

image

NGKL జిల్లా వంగూర్ మండలానికి ఘనమైన చరిత్ర ఉంది. వంగూర్‌ను 6వ శతాబ్దంలో శాసనాల్లో ఒక విషయ రాజ్యాంగా పేర్కొన్నారు. చాళుక్యులు, పల్లవులు పాలనతో పాటు కందుకూరు చోళులు 250 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు వంగూర్ రాజ్యాన్ని పాలించారు. పులకేశి కుమారుడు విక్రమాదిత్యుడు గెల్వలాంబ దేవాలయాన్ని నిర్మించాడు. తెలంగాణలో రెండో కథల సంపుటి, గడ్డి పూలు కథల రచయితలు ఇద్దరూ ఇక్కడి వారే. ప్రముఖ పరిశోధకుడు యాదగిరి చారి ఈ మండలం వారే.

Similar News

News April 20, 2025

KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

image

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.

బోధన్ డంపింగ్ యార్డ్‌ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

image

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!