News October 8, 2024
నాగర్‌కర్నూల్: విషాదం.. కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. లింగాలకు చెందిన అశోక్, శిరీష దంపతుల కొడుకు అభిరామ్(11 నెలలు). సోమవారం సాయంత్రం బాబు ఆడుకుంటుండగా ఇంట్లో ఉన్న బెడ్ లైట్ వైర్ తగిలి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే లింగాల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.
Similar News
News November 17, 2025
బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: MBNR SP

శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని మహబూబ్ నగర్ SP జానకి సూచించారు. చలికాలంలో పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని వివరించారు. బైక్ నడిపై వారు తప్పనిసరిగా హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించాలన్నారు.