News March 25, 2025
నాగర్‌కర్నూల్: సర్వే డబ్బులు చెల్లించాలని ఉపాధ్యాయుల వినతి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్‌కు యూటీఎఫ్ నాయకులు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. కుల గణన సర్వే డబ్బులు వెంటనే ఇవ్వాలని, పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.కృష్ణ, డాక్టర్ శ్రీధర్ శర్మ, ఉపాధ్యక్షుడు సి.తిరుపతయ్య, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు కుర్మయ్య, సోషల్ మీడియా కన్వీనర్ నెహ్రూ ప్రసాద్ పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమే: ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. తన సోదరుడు, రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం చిన్నచిన్న సంఘటనలను పక్కకు పెట్టి తన సోదరుడితో కలిసి నడుస్తామన్నారు. కాగా MNS చీఫ్ రాజ్ ఠాక్రే సైతం రెండు పార్టీలు కలవడం పెద్ద కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీలో విభేదాలతో రాజ్ ఠాక్రే పార్టీనుంచి బయటకు వచ్చి MNSను స్థాపించారు.
News April 19, 2025
MGU పీజీ, ఎంసీఏ, ఐపీసీ మూడో సెమిస్టర్ ఫలితాల విడుదల

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి శనివారం విడుదల చేశారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవాలన్నారు. .
News April 19, 2025
సిక్సర్ల రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ KL రాహుల్ రికార్డు సృష్టించారు. IPLలో భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్సులలో 200 సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడోస్థానంలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో సిక్సర్ బాది రాహుల్ ఈ ఫీట్ సాధించారు. రాహుల్ 129 ఇన్నింగ్సుల్లో 200 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 69Inns, ఆండ్రీ రస్సెల్ 97Inns తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.