News April 11, 2025
నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై హెచ్చరిక

సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News April 19, 2026
తిరుపతి కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్

ఈ నెల 20న తిరుపతి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, పూర్వ రసీదులతో హాజరుకావాలని సూచించారు. మీకోసం వెబ్‌సైట్, 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.
News April 19, 2026
బాపట్ల: ప్రయాణికులకు గుడ్ న్యూస్

బాపట్ల జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ రెండు కొత్త బస్సు సర్వీసులను సోమవారం ప్రారంభించనుంది. బాపట్ల నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు, చీరాల వాడరేవు నుంచి హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు సర్వీసులు నడుస్తున్నాయని జిల్లా ప్రజా రవాణా అధికారిణి సి.హెచ్. విమల తెలిపారు. ఈ సేవలు రోగులు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 19, 2026
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


