News April 3, 2025

నాగర్‌కర్నూల్: సాహితికి GOVT జాబ్.. సన్మానం 

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 45వ ర్యాంకు సాధించిన ఉపాధ్యాయులు రాజ్యలత-వెంకటరమణ దంపతుల కూతురు డాక్టర్ సాహితిని PRTU TS నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం  ఘనంగా సన్మానించారు. సాహితీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

డాక్టర్ డ్రెస్‌లో ఉగ్రవాది

image

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు, జైషే మహమ్మద్ ఉగ్రవాది ఉమర్ డాక్టర్ డ్రెస్‌లో ఉన్న ఫొటో బయటకు వచ్చింది. మెడలో స్టెతస్కోప్ వేసుకుని కనిపించాడు. కాగా ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. NIA, ఇతర భద్రతా సంస్థలు ఉమర్ నెట్‌వర్క్‌ గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పని చేసేవాడు.

News November 15, 2025

ఇలాంటి ఫుడ్ రోజూ తింటే..

image

రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను తరుచూ తీసుకుంటే 50 ఏళ్లలోపు వారిలో పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ‘రోజుకు మూడుసార్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారితో పోల్చితే 10సార్లు తినే మహిళల్లో అడెనోమా(క్యాన్సర్ కాని కణతులు) ముప్పు 45% ఎక్కువగా ఉంటుంది. ఇవే క్రమంగా క్యాన్సర్‌గా మారుతాయి’ అని USకు చెందిన JAMA ఆంకాలజీ పేర్కొంది. ఇందుకోసం 20 ఏళ్లలో 30వేల మందిపై సర్వే చేసినట్లు తెలిపింది.

News November 15, 2025

రంగారెడ్డి కలెక్టరేట్‌లో కుర్చీలను ఇలా వాడుతారా?

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. పార్సిల్, ఇతర వస్తువులను తరలించేందుకు సిబ్బంది కొత్త పంథా ఎంచుకున్నారని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అట్ట డబ్బాలను తరలించేందుకు ట్రాలీలను వాడాల్సింది పోయి.. ఏకంగా ఆఫీసు కుర్చీలనే ఉపయోగిస్తున్నారని వాపోయారు. కుర్చీలను ఇలా వాడడం వీరికే చెల్లిందని కలెక్టరేట్‌‌కు వచ్చిన వారు గుసగుసలాడుకుంటున్నారు.