News April 4, 2025
నాగర్కర్నూల్: 1 నుంచి 9వ తరగతుల పరీక్షల షెడ్యూలు విడుదల

నాగర్ కర్నూల్ జిల్లా విద్యా శాఖ అధికారులు ఒకటి నుంచి తొమ్మిదో తరగతుల సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల టైం టేబుల్ షెడ్యూల్ను ఈరోజు విడుదల చేశారు. ఈనెల 9 నుంచి 16 తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News December 22, 2025
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతూ కొత్తగా నియమితులైన ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ప్రభుత్వ బీసీ స్డడీ సర్కిల్లో శిక్షణ తీసుకోని గ్రూప్-3, గ్రూప్-4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కలెక్టర్ను సోమవారం కలిశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేసేందుకు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
News December 22, 2025
48 గంటల్లోనే జీవో.. మాట నిలబెట్టుకున్న పొంగులేటి..!

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన TWJF మహాసభలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ విధివిధానాలపై 10 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, ఆ గడువు అవసరం లేకుండానే కేవలం 48 గంటల్లోనే జీవో విడుదల చేయించి మంత్రి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
News December 22, 2025
విజయవాడ: అమ్మవారి భక్తులకు ఆన్లైన్ సేవలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈవో శీనా నాయక్ సూచించారు. www.kanakadurgamma.org వెబ్సైట్ ద్వారా లేదా Mana Mithra Phone App (WhatsApp) ద్వారా ఆన్లైన్లో పొందవచ్చని తెలిపారు. ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని భక్తులు సులభంగా టికెట్లు పొందాలని ఆయన కోరారు.


