News April 15, 2025

నాగర్‌కర్నూల్: 1,34,503 జవాబు పత్రాల మూల్యాంకనం: డీఈవో 

image

NGKL జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిందని డీఈవో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,34,503 ప్రశ్నాపత్రాలను పారదర్శకంగా మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి పంపామని అన్నారు. 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 384 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 130 స్పెషల్ అసిస్టెంట్‌లు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. పాల్గొన్న ఉపాధ్యాయులను డీఈవో సన్మానించారు.

Similar News

News November 24, 2025

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పారిశుద్ధ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేయడానికి ప్రజావాణికి బాధితులు వచ్చారు.

News November 24, 2025

అల్లూరి జిల్లాలో సెల్‌టవర్ కోసం గ్రామస్థుల వినతి

image

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ, సన్యాసమ్మపాలెం గ్రామాలకు ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు సెల్‌టవర్ ఏర్పాటుకు సంతకాల సేకరణ చేపట్టారు. దాదాపు 2,000 జనాభాలో 1,500 మంది ఫోన్ వాడుతున్న నేపథ్యంలో ఈ సేవలు అత్యవసరమని తెలిపారు. సేకరించిన దరఖాస్తును సోమవారం పాడేరు ఐటీడీఏ పీవో పూజకు సమర్పించనున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.

News November 24, 2025

314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

image

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.