News April 15, 2025
నాగర్‌కర్నూల్: 1,34,503 జవాబు పత్రాల మూల్యాంకనం: డీఈవో

NGKL జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిందని డీఈవో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,34,503 ప్రశ్నాపత్రాలను పారదర్శకంగా మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి పంపామని అన్నారు. 64 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 384 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 130 స్పెషల్ అసిస్టెంట్‌లు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. పాల్గొన్న ఉపాధ్యాయులను డీఈవో సన్మానించారు.
Similar News
News April 22, 2025
సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

AP: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి SP సూచనలు చేశారు. ఇటీవల రెండు కార్లు దగ్ధమైన నేపథ్యంలో జాగ్రత్తలు చెప్పారు. ముందే వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలని, రేడియేటర్ బెల్ట్, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవాలన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్లు ఘాట్ రోడ్డు ఎక్కడానికి ముందు 30 ని. వాహనాన్ని ఆపాలని, ఘాట్ రోడ్డు ఎక్కే సమయంలో AC ఆఫ్ చేసుకోవడం మంచిదని సూచించారు.
News April 22, 2025
అల్లూరి: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

రేపు ఉ.10 గంటలకు పదోతరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. అల్లూరి జిల్లాలో 258 పాఠశాలల నుంచి 11,766 మంది పరీక్ష రాయగా వారిలో 5,476 మంది బాలురు, 6,290 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 11,564 మంది కాగా ప్రైవేట్‌గా 202 మంది పరీక్ష రాశారు. 71 సెంటర్లలో పరీక్షలు జరగ్గా తెలుగు మీడియం 8,140, ఇంగ్లిష్ మీడియం 3,626 మంది ఉన్నారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it
News April 22, 2025
ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.