News March 20, 2025

నాగర్‌కర్నూల్: 26 రోజులైనా ఆచూకీ లేదు

image

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో 26 రోజులైనా కార్మికుల ఆచూకీ లభించలేదు. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ గుర్తించిన D1, D2 ఏరియాల్లో ఆయా బృందాలు పనిచేస్తున్నాయి. TBM మిషన్ భాగాలు కత్తిరించి టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. సాంకేతిక కారణాలతో వారం రోజులుగా రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. అడ్డుగా ఉన్న టీబీఎం శకలాలను తొలిగిస్తేనే రోబో సేవలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 28, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 28, 2025

2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు!

image

TG: రాష్ట్రంలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు RTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.

News November 28, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.