News April 6, 2025

నాగర్‌కర్నూల్: 6న ఫూలే-అంబేడ్కర్ జాతర కమిటీ కార్యవర్గ సమావేశం

image

ఈనెల 6న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవనంలో ‘ఫూలే-అంబేడ్కర్ జాతర ఉత్సవ జిల్లా కమిటీ’ సమావేశం నిర్వహిస్తున్నామని స్వేరో రాము శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీ కులాల కళాకారులందరూ తప్పకుండా హాజరవ్వాలని, సమావేశం అనంతరం ఈనెల 26న జరిగే ఫూలే -అంబేడ్కర్ జాతర ఉత్సవ కమిటీని ఎన్నుకుంటామని తెలిపారు.  

Similar News

News November 19, 2025

VJA: సారు.. కారు దిగరు.. కంటి చూపుతోనే తనిఖీలు.!

image

తాడిగడప-ఎనికేపాడు 100ఫీట్ రోడ్డులో AMVI రమణారావు తనిఖీలు నిర్వహిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ACకారులో కూర్చొని, వాహనం దిగకుండానే కంటిచూపుతోనే ఫిట్‌నెస్ పరిశీలన చేయడం గమనార్హం. రవాణా శాఖాధికారులు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఫైన్ వేయాలి. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారులు ఇలా కార్లలో కూర్చొని తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

News November 19, 2025

అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.

News November 19, 2025

రిస్క్‌లో 350 కోట్లమంది వాట్సాప్ కాంటాక్ట్స్?

image

డేటా లీకేజీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో పడనున్నట్లు వియన్నా యూనివర్సిటీ హెచ్చరించింది. ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్‌లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న 350 కోట్లమంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నంబర్లను చోరీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు.