News March 27, 2025
నాగర్‌కర్నూల్: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం పాలమూరు పరిధి MBNR, NRPT, GDWL, NGKL, WNP డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News April 20, 2025
ఎమ్మెస్ రామారావును కడప జిల్లా వాసులు మరచిపోలేరు

ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి.
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్‌పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News April 20, 2025
రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.