News March 26, 2025
నాగర్‌కర్నూల్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా NGKL డీసీసీ చీఫ్‌గా అచ్చంపేట MLA వంశీకృష్ణ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం KVN రెడ్డి, విజయ్ రెడ్డి, హబీబ్, ప్రతాప్ గౌడ్, మరో ఇద్దరు ఆశావహులుగా ఉన్నారు.
Similar News
News November 21, 2025
‘హిడ్మాను, మరికొందరిని పట్టుకొని ఎన్కౌంటర్ కథ అల్లారు’

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా కామ్రేడ్ రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో ఈనెల 15న నిరాయుధంగా ఉన్న సమయంలో పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు . AOB రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌ను చంపారని అందులో పేర్కొన్నారు.
News November 21, 2025
DoPTకి లేఖ రాసిన ACB

ఫార్ములా eరేస్ కేసు దర్యాప్తులో ACB స్పీడ్ పెంచింది. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి DoPT (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతి కోరింది. కేంద్ర సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరవింద్‌ను విచారించి ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. IASలను విచారించాలంటే DoPT పర్మిషన్ ఉండాలి. అటు A1 KTRను విచారించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతించడం తెలిసిందే.
News November 21, 2025
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: ఎస్పీ

ప్రజలకు పోలీసు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సబ్-డివిజన్ల పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.


