News September 12, 2024
నాగర్జునసాగర్కు తగ్గిన వరద

నాగార్జునసాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 71,001 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 43,334 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News December 12, 2025
నల్గొండ: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

రెండో విడతలో భాగంగా 10 మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడ్గులపల్లి, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.
News December 12, 2025
నల్గొండ: పార్ట్ టైమ్ ఉపాధ్యాయ పోస్ట్కు దరఖాస్తులు

నల్గొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు హిందీ బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ స్వామీ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎంఏ, బీఏ, హెచ్పీటీ (HPT) విద్యార్హత కలిగి ఉండాలి. డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరారు. మరింత సమాచారం కోసం 7995010669 నంబర్ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
News December 12, 2025
నల్గొండలో కాంగ్రెస్- 19, బీఆర్ఎస్- 11 బీజేపీ- 1

నల్గొండ మండల వ్యాప్తంగా గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధించి తమ పట్టు నిలుపుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 11 స్థానాల్లో గెలిచి సత్తా చాటగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాగా, రసూల్పుర, కోదండపురం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


