News October 13, 2024
నాగర్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 43,096 క్యూసెక్కుల ఇన్లో ఫ్లో వస్తుండగా అవుట్ ఫ్లో 54,096 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 307.2834 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు ఆదివారం సాయంత్రం తెలిపారు.
Similar News
News November 11, 2024
మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే రైస్ మిల్లు సీజ్: కలెక్టర్
NLG: జిల్లాలో ఎవరైనా రైస్ మిల్లర్ మద్దతు ధర కన్నా తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. అంతేగాక అన్ని రకాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర, బోనస్ ను పొందాలని సూచించారు.
News November 11, 2024
NLG: లింకులు, ఓటీపీలు చెప్పొద్దు.. జిల్లా కలెక్టర్ కీలక సూచన
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎవరు ఓటీపీ లేదా లింకులు అడగరని, అలాగే ప్రజలు లింకులు, ఓటీపీలు చెప్పాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని లక్ష్మీపురం, గాంధీనగర్ వీధులలో సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్లు సర్వే ఎలా చేస్తున్నారు పరిశీలించారు.
News November 10, 2024
NLG: విహారయాత్రలో విషాదం.. యువకుడు మృతి
నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ విహార యాత్రలో విషాదం నెలకొంది. ఆదివారం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి అనిల్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా అనిల్ స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి విహారయాత్ర కోసం వచ్చినట్టు పోలీసులు తెలిపారు.