News January 30, 2025
నాగర్జున సాగర్లో ఎకో టూరిజం అభివృద్ధి: సీఎం

నాగార్జున సాగర్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.
Similar News
News February 22, 2025
ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్, చిన్న చిన్న బడ్డీ కోట్లు తదితర ప్రదేశాలలో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తనిఖీలు నిర్వహించాలన్నారు.
News February 21, 2025
ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ త్రిపాఠి

వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News February 21, 2025
చింతపల్లి: పెళ్లింట తీవ్ర విషాదం

మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన చింతపల్లి మం.లో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.