News April 20, 2024

నాగర్ కర్నూల్‌ను వ్యవసాయ హబ్‌గా మారుస్తా: ప్రవీణ్ కుమార్

image

పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వ్యవసాయ హబ్‌గా మారుస్తానని BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా అపరిస్కృతంగా ఉన్న ఈ ప్రాంత సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.

Similar News

News December 25, 2024

ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూల బోకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

News December 25, 2024

MBNR: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. మరి MBNR, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.

News December 25, 2024

MBNR: మెదలైన ఎన్నికల సందడి.. యువత ఓటు ఎటు?

image

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువత ఓటును ఆకర్షించడానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి యువత ఓటు అధిక సంఖ్యలో నమోదు కావడంతో స్థానిక నాయకులలో భయం మొదలైంది. యువత మాత్రం అభివృద్ధి వైపే ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా నాయకులు ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.