News March 30, 2024
నాగర్ కర్నూల్‌పై అందరి గురి..!
NGKL MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP సిటింగ్ MP తనయుడు పోతుగంటి భరత్ బరిలోకి దించగా, కాంగ్రెస్ మల్లు రవిను పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ RS ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపింది. ఇప్పటికే NGKLలో PM మోదీ ప్రచారం చేయగా, KCR, రేవంత్ రెడ్డి సైతం ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలు NGKLలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 24, 2025
MBNR: తెలంగాణ విధ్వంసానికి కారణం కల్వకుంట్ల కుటుంబమే: ఎమ్మెల్యే
కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురే తెలంగాణ విధ్వంసానికి కారణమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజంఎత్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.
News January 24, 2025
MBNR: రాష్ట్రంలోనే నంబర్ 1 కాలేజీగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ లోని జేపీ ఐటీఐ కళాశాల భవననిర్మాణానికి రూ.కోటి మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కళాశాలను ఎమ్మెల్యే సందర్శంచి, కళాశాలలోని పరిసరాలను పరిశీలించారు. అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాశాలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోనే నంబర్ వన్ కాలేజీగా అభివృద్ధి చేస్తానన్నారు.
News January 24, 2025
పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.