News April 8, 2025
నాగర్ కర్నూల్ కలెక్టర్ కీలక సూచన

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News January 4, 2026
వింటర్లో దంతాల ఆరోగ్యంపై జాగ్రత్త!

శీతాకాలంలో దంతాల సమస్యలు ఎక్కువగా వచ్చే ఆస్కారముందని వైద్యులు చెబుతున్నారు. ‘ఈ సీజన్లో నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి లేక నోరు పొడిబారి దంతక్షయం వచ్చే ప్రమాదముంది. అందుకే తగినన్ని నీళ్లు తీసుకోవాలి. అలాగే వింటర్లో ఇమ్యూనిటీ తగ్గి చిగుళ్లపై బ్యాక్టీరియా దాడి చేస్తుంది. దీంతో వాపు, రక్తస్రావం జరుగుతుంది. ఇలా కాకుండా రోజుకొకసారి ఉప్పునీటితో పుక్కిలించాలి’ అని సూచిస్తున్నారు.
News January 4, 2026
నయా ట్రెండ్.. పెద్ద టైటిళ్లు అయితేనేం!

టాలీవుడ్లో పెద్ద టైటిళ్ల హవా కన్పిస్తోంది. క్యాచీగా ఉంటే చాలూ సినిమా పేరు పెద్దదైనా పర్లేదంటున్నారు మేకర్లు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ కోవలోవే. అందులోనూ అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. అటు వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్(ఆదర్శ కుటుంబం హౌస్ నం.47) కూడా లెంగ్తీదే కావడం విశేషం.
News January 4, 2026
రూ.2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు

సైబర్ మోసాలకు గురైన బాధితులకు గద్వాల్ జిల్లా పోలీసులు అండగా నిలిచారు. వివిధ కేసుల్లో పోగొట్టుకున్న రూ.2.46 లక్షలను రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మల్దకల్ పీఎస్ పరిధిలో ఓ బాధితురాలు కోల్పోయిన రూ. 1.80 లక్షల్లో, లక్ష రూపాయలను విజయవంతంగా తిరిగి ఇప్పించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.


