News March 21, 2025
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉష్ణోగ్రతలు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రలోని గడిచిన 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. నాగర్ కర్నూల్‌లో 38.9 ఉష్ణోగ్రత నమోదయింది. అటు తెలకపల్లి 38.9, కొల్లాపూర్ 38.9, పెద్దకొత్తపల్లి, అచ్చంపేట్ 38.8, బిజినపల్లి, వంగూరు 38.6, వెల్దండ, ఉప్పుగుంతల, కల్వకుర్తి 38.2, పదర, అచ్చంపేట 38.1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News April 2, 2025
‘లాపతా లేడీస్’ కథ దొంగిలించారా?.. రెడిట్ యూజర్ పోస్ట్ వైరల్

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బుర్ఖా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశారు. దీంతో ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ స్టోరీని దొంగిలించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చేయడంలో వారెప్పుడూ నిరాశపరచరని సెటైర్లు వేస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023లో విడుదలైంది.
News April 2, 2025
రేపు కర్నూలుకు YS జగన్ రాక.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కర్నూలుకు రానున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 11:45కు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం కర్నూలు GRC కన్వెన్షన్ హాల్లో జరిగే కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కూతురి వివాహా కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో జగన్ రాకకు జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
News April 2, 2025
నిర్మల్: నేటితో ముగియనున్న పది పరీక్షలు

నిర్మల్ జిల్లాలో గత నెల మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నేటీతో ముగియనున్నాయి. పది పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 43 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో పది పరీక్షలు ముగియనున్నాయి.