News March 1, 2025
నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. ✓వెల్దండ మండలం గుండాలలో కోనేరులో గల్లంతైన ఓమేష్ మృతదేహం లభ్యం.✓నాగర్ కర్నూలు జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.✓కొల్లాపూర్ లోని సింగోటంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.✓జిల్లాలో..నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓బల్మూరు మండలంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ.
Similar News
News November 24, 2025
సిరిసిల్ల: కార్మికులకు అవగాహన సదస్సు

ఈనెల 24 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు సిరిసిల్లలో భవన, ఇతర రంగాల నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున ఈ సదస్సుకు కార్మికులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 24, 2025
సిరిసిల్ల: కార్మికుల భీమ పెంపు పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్లలోని కలెక్టరేట్లో సిరిసిల్ల ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల భీమా పెంపు పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కార్మిక శాఖ అధికారి నజీర్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాదాబాయి, డిఆర్డిఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
ఢిల్లీ కాలుష్యం: సగం మందే ఆఫీసులకు

గాలి కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50% మందితోనే నిర్వహించాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చింది. GRAP-3లో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించింది.


