News March 11, 2025

నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ఆయన సూచించారు.

Similar News

News November 15, 2025

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి పిలిపించాలని తెలిపారు. పది విద్యార్థులకు బోధించే టీచర్లకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వొద్దని HMకు సూచించారు.

News November 15, 2025

పాఠశాలల అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రతి అధికారికి రెండు పాఠశాలలు కేటాయించి, పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. వినియోగంలో లేని ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల వివరాలను నవంబర్ 22లోపు పూర్తిచేయాలని సూచించారు. విద్యా సంస్థల మౌలిక వసతుల కోసం రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 15, 2025

MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.