News March 11, 2025
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News March 23, 2025
NLG: వాహనదారులకు శుభవార్త చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల మీద తిరిగే వాహనదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త చెప్పారు. గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారుల రోడ్లకు టోల్ ఫీజు వసూలు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ నిర్ణయం తీసుకోబోమని ఆయన అన్నారు.
News March 23, 2025
మేడ్చల్: ఓయో హోటల్ సీజ్ చేయాలి: ఏఐవైఎఫ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఓయో హోటల్స్ సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈసీఐఎల్‌లో జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ సీజ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోటల్ ముందు ధర్నా నిర్వహించారు. మైనర్లను ఓయోలోకి అనుమతించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
News March 23, 2025
తూ.గో: క్యాన్సర్ కేసుల నమోదులో భయాందోళనలు వద్దు

తూ.గో జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళనలు వద్దని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఆమె బలభద్రపురంలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకు గాను 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, అనపర్తి నియోజక వర్గం బలభద్రపురంలో 23 కేసులు గుర్తించినట్లు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.