News March 21, 2025

నాగర్ కర్నూల్: ‘జైలులో ఖైదీలు ఎలా ఉన్నారు..?’

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సబ్ జైలును గురువారం జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ, జిల్లా జడ్జి సబిత సందర్శించారు. జైల్లో ఖైదీలు ఎలా ఉన్నారు.. వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఖైదీలకు వండే ఆహార పదార్థాలను, వంటగదిని పరిశీలించారు. పిల్లలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు.

Similar News

News October 22, 2025

జిల్లాలో కార్తీక శోభ కనిపించే ఆలయాలు ఇవే..!

image

కార్తీకమాసంలో ఆలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసంలో ఏ ఆలయాల్లో చూసినా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జిల్లాలో రామతీర్థం రామస్వామి ఆలయం, విజయనగరంలో రామనారాయణ టెంపుల్, సారిపల్లి దిబ్బేశ్వరస్వామి ఆలయం, పుణ్యగిరి శివాలయం, గోవిందపురంలోని సంతోషిమాత ఆలయం, గంట్లాంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రతి ఏటా ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటూ వస్తోంది.

News October 22, 2025

బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

image

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్‌స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 22, 2025

కామారెడ్డి జిల్లాలో 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

image

కామారెడ్డి జిల్లాలో 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి మహేష్ కుమార్ తెలిపారు. హన్మాజీపేట, పుల్కల్, పిట్లం, అంతంపల్లి, బస్వాపూర్, పెద్ద కొడప్‌గల్, సోమార్‌పేట, రాజంపేట, ఆర్గొండ, కొండాపూర్, ముథోలి, గాంధారి భూంపల్లి, దుర్గం, తాడ్వాయి, దేమికలాన్ వంటి గ్రామాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర చెల్లిస్తామన్నారు.