News August 10, 2024
నాగర్ కర్నూల్: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్కపల్లి మండలం గట్టునెల్లికుదురులో తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపాడువ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి సుల్తాన్ మందలించాడు. దీంతో కోపంలో తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 7, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!
✔శ్రీశైలం డ్యామ్..8 గేట్ల ఎత్తివేత
✔NGKL:బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
✔దౌల్తాబాద్:అప్పుడే పుట్టిన శిశువుని పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
✔పలుచోట్ల వర్షం.. సజావుగా రాకపోకలు
✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
✔NRPT:10న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
✔పలుచోట్ల మట్టి విగ్రహాలు పంపిణీ
✔ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి:SIలు
News September 7, 2024
SDNR: దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడి హత్య
షాద్‌నగర్ పట్టణ సమీపంలోని హాజీ పల్లి రోడ్డులో ఎల్లయ్య అనే వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఆరేళ్ల బాలుడు చూశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడేమోనని భయంతో ఎల్లయ్య అనే వ్యక్తి బాలుని బండకేసి బాధడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తల పూర్తిగా చిక్కిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News September 7, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో ఈ మండలాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా!
ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల సంఖ్య 2011లో 7,78,184 ఉండగా ఇప్పుడు 10 లక్షలు దాటింది. GDWLలో కేటీదొడ్డి, గట్టు, ధరూర్, NRPTలోని దామరగిద్ద, మద్దూరు, కోస్గి, NGKLలోని బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, మన్ననూరు, అమ్రాబాద్, పదర, WNPTలో ఖిల్లాఘణపూర్, పెద్దమందడి, MBNRలో కోయిలకొండ, గండీడ్, బాలన గర్ మండలాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రత్యేక కథనం.