News March 22, 2025

నాగర్ కర్నూల్: నిరుద్యోగ యువతకు తప్పని సమస్య..!

image

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద లబ్ధిపొందేందుకు రేషన్ కార్డు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పలువురు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినప్పటికీ, పాత రేషన్ కార్డు తొలగించాల్సిన నిబంధనతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పెళ్లయిన వారు తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోనే కొనసాగుతుండడంతో కొత్త కార్డు పొందడానికి సమస్య ఎదురవుతోందని, దీంతో పథకానికి అప్లై చేయని పరిస్థితి నెలకొందన్నారు.

Similar News

News November 1, 2025

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

image

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.

News November 1, 2025

టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

image

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్‌లో పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.

News November 1, 2025

కరీంనగర్‌: కవిత ‘జనం బాట.. అందుకేనా..?’

image

MLC కవిత జనం బాటతో జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ పెట్టేందుకు బాటలు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో తన బలాబలాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కరీంనగర్‌లో ఆమె పర్యటన సాగుతోంది. మేధావులను, రైతులను, కుల సంఘాలను, విద్యావంతులను కలుస్తూ తాను ఎత్తుకున్న BCనినాదంపై ఫీడ్‌ బ్యాక్ తెలుసుకుంటున్నారు. జిల్లాల పర్యటన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ పెట్టాలా? వద్దా? అనే నిర్ణయానికి ఆమె వచ్చే ఛాన్స్ ఉంది.