News March 22, 2025

నాగర్ కర్నూల్: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

Similar News

News March 25, 2025

అశుతోశ్‌ను అలా ఎలా వదిలేశారో!

image

అశుతోశ్ గత ఏడాది పంజాబ్‌కు ఫినిషర్‌గా గేమ్స్ గెలిపించాడు. అతడి IPL స్ట్రైక్ రేట్ 167.26 కాగా సగటు 27. లీగ్‌లో భారత ఫినిషర్ దొరకడమే అరుదు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వేలంలో కేవలం ₹3.80 కోట్లకే దక్కించుకుంటుంటే ఇతర జట్లు చోద్యం చూశాయి. నిన్న 7 రన్స్‌కే 3వికెట్లు కోల్పోయిన DCని అశుతోశ్ ఒంటిచేత్తో ఒడ్డుకు చేర్చాడు. ముందు సీజన్లో ఆల్రెడీ తనను తాను నిరూపించుకున్న అతడిపై జట్లు ఎందుకు ఆసక్తి చూపలేదో మరి!

News March 25, 2025

రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

image

రంగారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రెడ్డిపల్లె, చుక్కాపూర్‌లో 37.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తోమ్మిదిరేకుల, ప్రొద్దుటూరు 37.3, మొయినాబాద్, మంగళ్‌పల్లి 37.2, కాసులాబాద్ 36.9, మొగలిగిద్ద 36.8, కేతిరెడ్డిపల్లి 36.7, కేశంపేట 36.6, ధర్మసాగర్, తుర్కయంజాల్, షాబాద్ 36.4, హస్తినాపురం, నాగోల్ 36.2, పేద్దషాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 25, 2025

రంగారెడ్డి: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో 2,158 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌కు 13 పరీక్ష కేంద్రాల పరిధిలో 2,965 మంది హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

error: Content is protected !!