News March 3, 2025
నాగలాపురం: ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల నిరీక్షణ

టీపీకోట సత్యవేడు మార్గంలో ఇవాళ రావాల్సిన ఏడు గంటల చెన్నై బస్సు రాకపోవడంతో ఇంటర్ పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వారి వాహనాల్లో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తుండగా మరి కొంతమంది విద్యార్థులు బస్సు కోసం రోడ్లపై నిరీక్షిస్తున్నారు. పరీక్షల వేళ ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Similar News
News December 6, 2025
Meesho: ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుంది..

IIT గ్రాడ్యుయేట్లు విదిత్ ఆత్రేయ, సంజీవ్ బర్న్వాల్ 2015లో ఓ ప్రయోగంలా ప్రారంభించిన స్టార్టప్ ‘మీషో’. చిన్న వ్యాపారులకు వేదికగా నిలిచింది. ధరలు తక్కువ కావడటంతో సేల్స్ పెరిగాయి. ఐదేళ్లలో కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. 2025 FYలో ₹9,390 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇప్పుడు ₹5,421 కోట్ల IPOతో స్టాక్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీకి మీషో సిద్ధమవుతోంది. ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.
News December 6, 2025
VJA: ఇండిగో సమస్య.. హెల్ప్‌లైన్ నంబర్ల వివరాలివే.!

ఇండిగో విమాన ప్రయాణాలలో సమస్య తలెత్తడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఇండిగో హెల్ప్‌లైన్ నంబర్లలో లేదా డ్యూటీ టెర్మినల్ మేనేజర్‌ను 9493192531 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. ఈ నంబర్లలో ఇండిగో విమానాల తాజా సమాచారం లభిస్తుందన్నారు.


