News March 25, 2025

నాగలాపురం: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

నాగలాపురం మండలంలోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో చరణ్(23) అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిందితుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News November 19, 2025

నవంబర్ 19: చరిత్రలో ఈ రోజు

image

*1828: స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జననం
*1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
*1960: సినీ నటుడు శుభలేఖ సుధాకర్ జననం
*1975: మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ జననం
*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
*ప్రపంచ టాయిలెట్ దినోత్సవం

News November 19, 2025

KNR: స్థానిక సమరం షురు.. వచ్చే నెలలో ఎన్నికలకు క్యాబినెట్ పచ్చజెండా

image

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారంతో వీడగా, ఇక పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,216 గ్రామ పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

News November 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 19, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.