News March 11, 2025
నాగాయలంక: పనులను పునః ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

నాగాయలంకలోని జలక్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌లు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను పునః ప్రారంభించారు. సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. జలక్రీడలపై నాగాయలంక అనువైన ప్రదేశమన్నారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఈ ప్రాంతం వాసి కావటంతో భవిష్యత్తులో నాగాయలంకకు దేశంలోనే గొప్ప ప్రఖ్యాతులు రానున్నాయని ఆశించారు.
Similar News
News March 27, 2025
గుడివాడ: కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయి.!

మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు 3 వాల్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వైసీపీ నేత దుక్కిపాటి శశి భూషణ్ తెలియజేశారు.
News March 27, 2025
పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర: ఎస్పీ

ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్‌లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.