News April 3, 2025
నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం

నాగాయలంక పీఏసీఎస్‌లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్‌లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
Similar News
News April 18, 2025
ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News April 18, 2025
హనుమాన్ జంక్షన్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.
News April 18, 2025
మసులా బీచ్ వేదికగా మేలో నేషనల్ వాటర్ స్పోర్ట్స్ పోటీలు

నేషనల్ వాటర్ స్పోర్ట్స్‌కు మసులా బీచ్ వేదిక కాబోతుంది. మే 15 నుంచి నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌లో ఈ పోటీలు మిలితం కానున్నాయి. బీచ్ కబడ్డీతో పాటు SEA KAYA KING పోటీలను మసులా బీచ్ (మంగినపూడి బీచ్) లో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీలకు సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలి రానున్నారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు మచిలీపట్నం సిద్ధమవుతోంది.