News February 21, 2025
నాగారం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

ఓ యువతి ప్రియుడి ఇంటి ధర్నా చేసిన ఘటన మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. బాధితురాలి వివరాలు.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మల్లెపాక నాగరాజు వెంపటి గ్రామానికి చెందిన యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని గురువారం అతడి ఇంటి ముందు బైఠాయించింది. వేరే అమ్మాయిని వివాహం చేసుకుని తనకు ఫొటోలు పంపాడని తనకు న్యాయం చేయాలని కోరింది.
Similar News
News March 21, 2025
NLG: GOOD NEWS.. తీరనున్న తాగునీటి సమస్య

వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకుగాను, తాగునీటి బోర్లు, చేతిపంపులు, పైపులైన్లు, తాగునీటి ట్యాంకుల మరమ్మతులకు గాను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 827 తాగునీటి పనులు చేపట్టేందుకు DMFT నిధుల నుంచి రూ.5 కోట్ల 10 లక్షలను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎక్కడా తాగునీటికి సమస్య రాకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News March 21, 2025
కుల, మత విద్వేషాలను రెచ్చగొడితే కఠిన చర్యలు: ఎస్పీ

కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రానున్న ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే వారిపై నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొడితే పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
News March 21, 2025
నల్గొండ: టోల్ విధించే ప్రసక్తే లేదు: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లకు టోల్ విధించే ఆలోచనే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో సిద్దిపేట MLA హరీశ్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. కాగా, రోడ్లపై చర్చ జరుగుతున్న సందర్భంగా తమ వద్ద రోడ్లు సరిగ్గా లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ నవ్వుతూ అన్నారు.