News March 20, 2025
నాగార్జునసాగర్‌కు భారీగా కేటాయింపులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 24, 2025
ఈ నెల 26న మీ చేతికి మీ భూమి: మంత్రి

మీ చేతికి మీ భూమి 22 ఏ భూస్వేచ్ఛ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ను ఈ నెల 26న శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల విషయమై ఎవ్వరైనా విజ్ఞాపనలు చేసుకోవచ్చన్నారు. సంబంధిత అర్జీలను రెవెన్యూ అధికారులు పరిశీలించి, న్యాయం చేస్తారన్నారు.
News December 24, 2025
HYD: అందెశ్రీ సమాధికి ఏంటీ గతి?

రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియల వేళ ఇచ్చిన ప్రభుత్వ హామీలు నీటి మూటలయ్యాయి. ఆయన మరణించినప్పుడు స్వయంగా పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ‘స్మృతివనం’నిర్మిస్తామని ప్రకటించారు. కానీ నేడు ఘాట్కేసర్లోని ఆయన సమాధి కనీసం గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిస్తోంది. “జయ జయహే తెలంగాణ” అంటూ జాతిని మేల్కొల్పిన కవికి దక్కుతున్న గౌరవం ఇదేనా అని సాహితీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 24, 2025
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. 11 గ్రామాలు

రాష్ట్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాల పరిధిలోని 23 మండలాలలోని 121 గ్రామాల గుండా వెళ్లనుంది. పల్నాడు జిల్లా పరిధిలో పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్ పురం, కంభంపాడు, కాశిపాడు, మీదుగా అమరావతి మండలం ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు తదితర గ్రామాల నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వేళ్లనుంది.


