News July 26, 2024
నాగార్జునసాగర్ ఎత్తిపోతల పథకానికి రూ.500 కోట్లు
నాగార్జునసాగర్ పరిధిలోని ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. దేవరకొండతో పాటు సాగర్ ఎడమ కాలవ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, HNR నియోజకవర్గాలలో సుమారు రూ.3 వేల కోట్లతో గతంలో KCR ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించారు. కానీ నిధులు కేటాయించకపోవడంతో పునాది దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం ముందుకు సాగనుంది.
Similar News
News November 6, 2024
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్వైజర్లను నియమించడమే కాకుండా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.
News November 5, 2024
SRPT: యువకుడి ఆత్మహత్య
కోదాడ మండలం కూచిపూడి తండాలో సాయి భగవాన్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విషయంలో మాట్లాడదామని పిలిచి యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి సాయి భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 5, 2024
SRPT: మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన టీచర్ సస్పెండ్
మోతె మండలం రామాపురం ప్రాథమిక పాఠశాల <<14534111>>ఉపాధ్యాయుడు ఉపేందర్ మద్యం సేవించి<<>> పాఠశాలకు వస్తున్నాడని స్థానికులు, అధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించారు. ఉపేందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను మండల విద్యాధికారి ద్వారా సంబంధిత ఉపాధ్యాయుడికి అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.