News April 5, 2025
నాగార్జునసాగర్: కిడ్నాప్.. వ్యక్తి హత్య

నాగార్జునసాగర్‌లోని హిల్స్ కాలనీలో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాలు.. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం మామా అల్లుళ్లు. వీరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. దీంతో అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 28, 2025
దేవరకొండకు సీఎం రేవంత్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి విచ్చేయనున్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 6వ తేదీన జిల్లాలోని దేవరకొండకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ నాయకులు సమీక్షించారు.
News November 28, 2025
నగదును ఎలా స్వీకరిస్తున్నారు?.. ఇలా త్రిపాఠి వాకబు

గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మర్రిగూడ మండలం సరంపేట, శివన్నగూడెం, వట్టిపల్లి గ్రామాలలో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించే నగదును ఎలా స్వీకరిస్తున్నారని ? అలాగే వారికి రశీదు ఇస్తున్నారా? అని కలెక్టర్ సిబ్బందిని అడిగారు.
News November 28, 2025
NLG: హుండీ లెక్కింపు.. ఆదాయం@రూ.42 లక్షలు!

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం హుండీలను శుక్రవారం లెక్కించారు. 49 రోజులకు సంబంధించి రూ.42,87,544 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సాల్వాది మోహన్ బాబు తెలిపారు. అలాగే అన్నదానం కార్యక్రమానికి భక్తులు సమర్పించిన హుండీని లెక్కించగా రూ.42374లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 39 అమెరికా, 5 కెనడ, 10 శ్రీలంక డాలర్లు వచ్చినట్లు తెలిపారు.


