News September 21, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరుంది. ఔట్ ఫ్లో: 31,196 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 31,196 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News October 10, 2024
గ్రేట్.. వలస కూలీగా వచ్చి కుమారుణ్ని టీచర్ చేసింది
వలస కూలీగా వచ్చిన మహిళ కష్టపడి కుమారుణ్ని టీచర్‌గా చేసింది. గ్రామస్థుల వివరాలిలా.. బట్టు లక్ష్మి కొన్నేళ్ల క్రితం రెడ్లకుంటకు వలస వచ్చింది. ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేసింది. కుమారుడు వెంకటేశ్వర్లుని కష్టపడి చదివించింది. డీఎస్సీ ఫలితాల్లో అతను సూర్యాపేట జిల్లా 11వ ర్యాంకు సాధించాడు. కొడుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దిన లక్ష్మి ఎందరో మాతృమూర్తులకు ఆదర్శప్రాయంగా నిలిచింది.
News October 10, 2024
NLG: యాసంగి సాగు ప్రణాళిక ఖరారు
వ్యవసాయ శాఖ యాసంగి సాగు ప్రణాళికను ఖరారు చేసింది. వానాకాలం సీజన్ ముగియడంతో.. గత యాసంగి సీజన్లో జిల్లాలో 4,44,041 ఎకరాల్లో వరి, వేరుశనగ, పెసర తదితర పంటలు సాగు కాగా ప్రస్తుత యాసంగిలో 5.83 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటల సాగు కానున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చెరువులు , కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి .
News October 10, 2024
చౌటుప్పల్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు
చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన అఫ్జల్ ఖాన్, ఖాజాబీ కుటుంబ సభ్యులు డీఎస్సీ ఫలితాలలో ఉద్యోగాలు సాధించారు. వారి కుమారులు జావిద్ ఖాన్ SGT, ఖాదీర్ ఖాన్ PGT ఇంగ్లిష్, కోడలు అసినా బేగం TGT Maths , గురుకులంలో ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. దీంతో గ్రామస్థులు అభినందనలు తెలిపారు. తండ్రి పాన్ షాప్ నడుపుతూ తమను బాగా చదివించినట్లు వారు తెలిపారు.