News September 24, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 44,152 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 44,153 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. కుడి కాలువకు 10,120 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 2,765 క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1,800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 28, 2025

NLG: ముందుగానే మున్సి ‘పోల్స్’….!

image

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా… ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.

News December 28, 2025

వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.

News December 28, 2025

NLG: అంగన్వాడీల యాప్ సోపాలు!

image

జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌లతో ఆపసోపాలు పడుతున్నారు. యాప్‌లను నిర్వహించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్ లబ్దిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,093 కేంద్రాలు ఉన్నాయి. పోషన్ ట్రాకర్ యాప్‌తో ఫేస్ రీడింగ్ చేయని లబ్ధిదారులకు ఆరోజు పౌష్టికాహారం పంపిణీ చేయడం లేదు. దీంతో గంటల తరబడి కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తుంది.