News September 24, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 44,152 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 44,153 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. కుడి కాలువకు 10,120 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 2,765 క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1,800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 11, 2025
NLG: ఫెయిలైన అభ్యర్థులకు మరో అవకాశం

టీటీసీ కోర్సు పూర్తిచేసినవారు, గతంలో పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థుల కోసం ఆగస్టు 3న (ఆదివారం) థియరీ పరీక్ష జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు డీఈవో బిక్షపతి తెలిపారు. ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లతో గంట ముందుగా హాజరుకావాలని సూచించారు.
News July 11, 2025
NLG: సంబురంగా మహిళాశక్తి సంబరాలు

జిల్లాలో మహిళా శక్తి సంబరాలు సంబురంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. 12 నుంచి 18 వరకు నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ పంపుల నిర్వహణ, చేపలు, పెరటి కోళ్ల పెంపకం, కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, పాల డెయిరీ ఏర్పాట్లను ప్రోత్సహిస్తూ మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
News July 11, 2025
NLG: పంతుళ్ల పరేషాన్.. బడికి డుమ్మా ఇక కుదరిదిక!

సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు FRS విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో FRS విధానం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది.