News October 24, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
ఎగువ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే వరద తగ్గడంతో క్రస్టు గేట్లను మూసివేశారు. జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 48,569 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 48,569 క్యూసెక్కులుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం 589.50 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గాను ప్రస్తుతం 310 టీఎంసీలుగా ఉందన్నారు.
Similar News
News November 8, 2024
ప్రజల మద్దతుంటే అరెస్టులెందుకు..?: హరీశ్ రావు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాలె రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. హౌస్ అరెస్టులు చేసి చేపట్టే పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించదన్నారు. మూసీ మురికికి 50ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజల మద్దతు ఉంటే అక్రమ అరెస్టులెందుకుని.. దమ్ముంటే పేదల ఇళ్లు కూల్చిన హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
News November 8, 2024
NLG: సీఎం రేవంత్ రెడ్డి నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..!
> ఉ.9 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరుతారు.
> ఉ.9.20కి యాదాద్రి చేరుకుంటారు.
> ఉ.10.05 నుంచి ఉ.11.15 వరకు యాదగిరిగుట్టలో స్వామి దర్శనం
> ఉ.11.30 నుంచి మ.1 గంట వరకు YTDA, ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష.. అనంతరం మల్లన్నసాగర్-యాదాద్రి మిషన్ భగీరథ పైపులైన్‌కు శంకుస్థాపన
> మ.1-1.30 వరకు లంచ్ బ్రేక్.. మ.2.10-3 వరకు సంగెం-భీమలింగం వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర
News November 8, 2024
NLG: సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్
మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్‌లో గురువారం కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరికీ సమాచారాన్ని వెల్లడించేది కాదని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు.