News April 5, 2024

నాగార్జునసాగర్ నీటి మట్టం వివరాలు..

image

 నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 134.9183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెయిన్ పవర్ హౌస్‌కు నిల్, ఎస్సేల్బీసీ, ఎడమ కాల్వకు 7,675 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఇన్ ఫ్లో లేదు.

Similar News

News October 17, 2025

నల్గొండ జిల్లాలో 1000 దాటిన దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలోని మద్యం దుకాణాలకు గురువారం మరో 496 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా, నేటి వరకు 1052 దరఖాస్తులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.

News October 17, 2025

నల్గొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వానకాలం ధాన్యం సేకరణపై కలెక్టరేట్‌లో గురువారం ఆమె కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 92814 23653కు ఫిర్యాదులను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

News October 16, 2025

మెరుగైన విద్యను అందించాలి: నల్గొండ కలెక్టర్

image

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ద్వారా ఇంకా మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీల ప్రత్యేక అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేజీబీవీలపై మండల ప్రత్యేక అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.