News April 5, 2024
నాగార్జునసాగర్ నీటి మట్టం వివరాలు..
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 134.9183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెయిన్ పవర్ హౌస్‌కు నిల్, ఎస్సేల్బీసీ, ఎడమ కాల్వకు 7,675 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఇన్ ఫ్లో లేదు.
Similar News
News January 17, 2025
మిర్యాలగూడ: ఆ కుటుంబంలో ఆరుగురు DOCTORS
నల్గొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన రామారావు-జీవనజ్యోతి దంపతులు ఇద్దరు డాక్టర్‌లే. వీరు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే గొప్పవిషయం ఏంటంటే.. వీరి ఇద్దరు కుమారులు శ్రీహర్ష, పృథ్వి, కోడళ్లు అమూల్య, శ్రావ్య కూడా డాక్టర్‌లే. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైద్య వృత్తిలో ఉండటం అరుదుగా కనిపిస్తుంది.
News January 16, 2025
NLG: షిరిడీలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!
షిరిడీ సమీపంలో జరిగిన <<15171774>>ఘోర రోడ్డు ప్రమాదం<<>>లో జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కొండగడపలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రెండు రోజుల క్రితం షిరిడీకి వెళ్లారు. నిన్న ఉదయం దర్శనాంతరం తుఫాన్ వాహనంలో సమీప దర్శనీయ స్థలాలు చూసేందుకు వెళ్లి తిరిగి షిరిడీకి వస్తుండగా వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమలత(59), ప్రసన్న లక్ష్మీ(45), అక్షిత(20), వైద్విక్ నందన్(6నెలలు) మృతి చెందారు.
News January 16, 2025
రోడ్డు ప్రమాదంలో నలుగురు భువనగిరి జిల్లా వాసులు మృతి
మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భువనగిరి జిల్లా వాసులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులు మోత్కూర్ మున్సిపాలిటీలో పరిధిలోని కొండగడప వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉంది. రెండు రోజుల క్రితం వీరు షిరిడీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.