News November 20, 2024

నాగార్జునసాగర్ పర్యాటక రంగానికి మహర్దశ!

image

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జునసాగర్ పర్యాటక రంగానికి మహర్దశ పట్టనుంది. రూ.100 కోట్లతో సాగర్‌తో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అనువైన చోట స్టార్ హోటల్స్, కాటేజీలు, జలాశయంలో వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్లు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Similar News

News December 6, 2024

NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు

image

నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టారు. రెండ్రోజులుగా సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News December 6, 2024

NLG: ముగిసిన జీఎన్ఎమ్ పరీక్షలు

image

NOV 25న ప్రారంభమైన GNM పరీక్షలు గురువారంతో ముగిశాయని నల్గొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణ పర్యవేక్షణలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News December 6, 2024

NLG: ఆయిల్ పామ్‌పై పెరుగుతున్న ఆసక్తి!

image

రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండటంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాదిలో రెండింతల సాగు పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతులకు రాయితీలు ఇస్తోంది. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్‌ పాం సాగువైపు దృష్టి సారించారు.