News October 1, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Similar News
News January 11, 2026
నల్గొండ: ఏసీబీలో ‘లీక్’ వీరులు..!

అవినీతి తిమింగలాలను పట్టించాల్సిన ACBలోనే కొందరు ‘లీకు వీరులు’ తయారవ్వడం కలకలం రేపుతోంది. దాడులు నిర్వహించాల్సిన సిబ్బందే, సదరు అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న ఓ CI, హోంగార్డు కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.
News January 11, 2026
రైతు భరోసా… ఇంకెంతకాలం నిరీక్షణ!

రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం జిల్లాలోని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదార్ రైతులు ఉండగా యాసంగి సీజన్పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది జనవరి 26నే ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాగా.. ఈసారి నవంబర్లో సీజన్ ప్రారంభమై ఈ నెలాఖరుకు ముగుస్తున్నా నిధుల ఊసే లేదు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
News January 11, 2026
NLG: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే భర్తీ చేయబడే ఉద్యోగాలతోపాటు బ్యాంకింగ్, RRB ఇతర పోటీ పరీక్షలకు ఎస్సీ స్టడీ సర్కిల్స్లో ఉచిత రెసిడెన్షియల్, శిక్షణకు అసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.శశికళ తెలిపారు. అభ్యర్థులను పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని, ఫిబ్రవరి 8న జరిగే పరీక్షలో పాల్గొనాలని కోరారు.


