News October 1, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Similar News
News October 5, 2024
NLG: బీఈడీ ఫలితాలు విడుదల
MG యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్ ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ లక్ష్మీప్రభ శుక్రవారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 92.6 శాతం, మూడో సెమిస్టర్లో 79.30 శాతం, రెండో సెమిస్టర్లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
News October 5, 2024
యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త
మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 5, 2024
నేటి నుంచి నల్గొండలో చేనేత హస్తకళా మేళా
నల్గొండ బోయవాడలో గల ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఈ నెల 5 నుంచి 27 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఇందులో అఖిలభారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి చేనేతను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్త్రాలను అమ్మడం జరుగుతుందని తెలిపారు.