News July 31, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అప్డేట్

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 522.20 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.5050 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 153.3180 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ ఇన్ ప్లో: 2,32,843 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 27,454 క్యూసెక్కులుగా ఉంది.
Similar News
News December 1, 2025
చండూర్: ఏకగ్రీవాల పేరుతో ఓటు హక్కు దోపిడీ: రఫీ

చండూర్ మండల బంగారిగడ్డ పంచాయతీ రిజర్వేషన్‌ను అగ్రకుల పెత్తందారులు తమ అనుచరులతో దుర్వినియోగం చేస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రఫీ సోమవారం నల్గొండలో ఆరోపించారు. స్థానిక ఎన్నికలను డబ్బు ప్రలోభాలతో ఏకగ్రీవం పేరుతో హరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటు హక్కు హరించబడుతోందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలను చట్టపరంగా అడ్డుకుంటామని అన్నారు.
News December 1, 2025
నల్గొండ జిల్లాలో నేటి నుంచి కొత్త వైన్సులు!

జిల్లాలో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకాల పరిమితితో 154 మద్యం షాపులను డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. పాత షాపులకు గడువు పూర్తి కావడంతో నేటి నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే 154 వైన్స్‌ల లైసెన్స్ పొందిన వారు షాపులు తెరిచేందుకు అనుమతి పొందారు. కొత్తగా దుకాణాలు తెరిచే వ్యాపారులు ఇప్పటికే మద్యాన్ని డంపింగ్ చేసుకున్నారు.
News December 1, 2025
నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్ల నామినేషన్ల ఆమోదం

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.


