News July 17, 2024
నాగార్జున సాగర్లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు
గుంటూరు జిల్లా నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నాగార్జున సాగర్తో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా ఇందుకోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి.
Similar News
News November 5, 2024
తుళ్లూరు: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో 400/220 కేవీ సబ్ స్టేషన్ నవంబర్ 7న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించి మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలో భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా కేవీ సబ్ స్టేషన్ను జీఐఎస్ పద్ధతిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాన్స్కో ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
News November 5, 2024
గుంటూరు: ఆర్టీసీలో అప్రెంటిస్షిప్కి దరఖాస్తులు ఆహ్వానం
APSRTCలో అప్రెంటిస్ షిప్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.రవికాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apsrtc.ap.gov.in లో చూడాలని చెప్పారు.
News November 5, 2024
నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే!
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం డ్రోన్ ఐటీ, సెమీకండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేసి, తరువాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు