News September 6, 2024
నాగార్జున సాగర్ 24గేట్ల నుంచి నీరు విడుదల

కృష్ణ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ఉండటంతో నాగార్జున్ సాగర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం రాత్రి 24 రేడియల్ క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 2,36,302 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 589.90 అడుగులు ఇది 311.7462 టీఎంసీలకు సమానం.
Similar News
News December 3, 2025
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.
News December 3, 2025
నడింపాలెంలో రూ. 93.82 కోట్లతో CRIYN, 100 పడకల ఆసుపత్రి

ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాజ్యసభ వేదికగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.93.82 కోట్ల అంచనాతో ఈ నిర్మాణం ఉండబోతోందని చెప్పారు.


