News November 22, 2024

నాగావళి, వంశధార కోతల నియంత్రణపై డిప్యూటీ సీఎం స్పీచ్

image

నాగావళి, వంశధార నదీ ప్రాంతాల్లో తీర ప్రాంత కోతల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. జాతీయ బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించిందని, అధ్యయన రిపోర్ట్ రాగానే ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు.

Similar News

News December 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో చలి పంజా ..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. చలిగాలుల ఉద్ధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రతకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణుకుతున్నారు. గ్రామాల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకొని కాచుకుంటున్నారు. ఎండ వచ్చి చలి తీవ్రత తగ్గాకే పనులకు వెళ్తున్నారు. చలి తీవ్రతకు సీజనల్‌ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

News December 14, 2024

స్వదేశానికి చేరుకోనున్న సిక్కోలు మత్స్యకారులు

image

శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించి, గత 6 నెలలుగా అక్కడి జైల్లో మగ్గుతున్న జిల్లాకు చెందిన మత్స్యకారులు తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ మేరకు శ్రీలంకలోని భారత ఎంబసీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి వేటకు వెళ్లి, ఆనుకోకుండా శ్రీలంక సముద్ర జలాల్లోకి చేరుకోవడంతో కోస్టుగార్డు పోలీసులు అరెస్టు చేశారు.

News December 14, 2024

SKLM: నేడే జాతీయ లోక్ అదాలత్ 

image

డిసెంబర్ 14వ తేదీ శనివారం జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లా మొత్తం మీద 19 బెంచీలు నిర్వహించామని దీనిని జిల్లాలో గల ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు జిల్లా అంతటా పరిష్కార చేస్తామని తెలిపారు.